అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జులై 15 వరకు పొడిగించిన కేంద్రం

31-telugu-nri-s-reached-andhra-pradesh-safely-from-chicago
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీలపై విధించిన నిషేధాన్ని వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది.

అయితే ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే విమానాలకు వర్తించదని పేర్కొంది. దేశీయ విమాన సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

- Advertisement -
- Advertisement -