నా పేరు చెప్పగానే వణికిపోయారు: రష్యా పర్యటనను గుర్తుచేసుకున్న స్టాలిన్

11:34 am, Sat, 14 September 19

చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు.

రష్యా పర్యటనలతో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తన పేరు స్టాలిన్ అని చెప్పగానే రష్యా ప్రజలు తనవైపు వింతగా చూశారని, భయపడ్డారని స్టాలిన్ చెప్పారు. రష్యన్లు తమ కనురెప్పలు పైకి లేపి మరీ తనను చూశారని చెప్పుకొచ్చారు.

”రష్యా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక నా పేరు అడిగారు. స్టాలిన్ అని చెప్పగానే ఎయిర్ పోర్టు సిబ్బంది వింతగా చూశారు. భయంగా కనిపించారు. నా పాస్ పోర్టు చెక్ చేసే సమయంలో అనేక ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాతే నన్ను లోనికి అనుమతించారు. ఇది 1989లో రష్యా పర్యటనలో నాకు ఎదురైన అనుభవం ” అని స్టాలిన్ వివరించారు.

నాటి జ్ఞాపకాలను ఆయన మరోసారి మీడియాతో పంచుకున్నారు. కొన్ని సమయాల్లో పేరు వల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చెప్పారు. యుద్ధం సమయంలో స్టాలిన్, లెనిన్, ట్రోట్ స్కీ, ప్రవడా అనే పేర్లు వినగానే భయపడే వారని స్టాలిన్ పేర్కొన్నారు.