ఢిల్లీ రోహిణి కోర్టులో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు మూడవ అంతస్తులోని రికార్డు రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -