భారీగా పెరిగిన విదేశీ మారక ద్రవ్యం.. ఇదే తొలిసారన్న ఆర్‌‌బీఐ

- Advertisement -

భారత విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

దేశంలో విదేశీ మారక ద్రవ్యం విలువలు మొదటిసారిగా 500 బిలియన్ డాలర్లు(రూ.37 లక్షల కోట్లు) దాటిందని ఆర్‌బీఐ ప్రకటించింది.

- Advertisement -

ఈ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది.

‘ఈ వారంలో దాదాపు 8.2 బిలియన్ డాలర్లు(రూ.6వేల కోట్లకు పైగా) నిల్వ పెరిగింది.

దీంతో జూన్ 5 నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం 501.7 బిలియన్ డాలర్లకు(రూ.38 లక్షల కోట్లకు పైగా) చేరింది.

మొత్తం విదేశీ మారక ద్రవ్యంలో విదేశీ కరెన్సీ నిల్వలు 463 బిలియన్ డాలర్లు(రూ.35 లక్షల కోట్లకు పైగా ) ఉంది.

బంగారం నిల్వలు 32.35 బిలియన్ డాలర్లు(రూ.24 వేల కోట్లకు)గా ఉంద’ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికీ ఈ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం పెరగడం ఎంతో గొప్ప విషయమని పలువురు నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -