ఆంబిడెంట్ కేసు: పోలీసుల ఎదుట లొంగిపోనున్న‘గాలి’..? ముందస్తు బెయిల్ పిటిషన్.. సోమవారానికి వాయిదా!

gali janardhan is reddy ready to surrender to police
- Advertisement -

gali janardhan is reddy ready to surrender to police

హైదరాబాద్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి పోలీసులకు లొంగిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానమే అందరి నోట వినబడుతుంది. ఈడీ కేసుల నుంచి బెంగళూరులోని అంబిడెంట్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులకు విముక్తి కలిగించేందుకు గాలి జనార్దనరెడ్డి  20 కోట్ల రూపాయలు డీల్‌‌ కురుద్చుకుని కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

- Advertisement -

చదవండి: అంబిడెంట్ కంపెనీ వ్యవహారం: గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసుల వేట.. హైదరాబాదులో ఉండొచ్చని అనుమానం…

ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు తన కోసం గాలింపు మొదలుపెట్టడంతో గాలి జనార్థన్ రెడ్డి అజ్ఞాతలోకి వెళ్ళిపోయారు.  ఆయన కోసం సీసీబీ బృందాలు అటు కర్ణాటక, ఇటు హైదరాబాద్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలో ఆయన శనివారం సీసీబీ ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి తన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో శుక్రవారమే పిటిషన్‌ దాఖలు చేయించారు.

విచారణాధికారులను మార్చాలంటూ…

తన అనుచరుడైన మరో ఎమ్మెల్యే శ్రీరాములతో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అంతేకాదు, తనను కేసుల నుంచి పూర్తిగా విముక్తి కల్పించాలని, విచారణాధికారులయిన సీసీబీ డీసీపీ గిరీశ్‌, ఏసీపీ వెంకట ప్రసన్న‌ను మార్చాలని కోరుతూ గాలి జనార్దనరెడ్డి రెండు వేర్వేరు పిటిషన్‌లను హైకోర్టులో దాఖలు చేయించారు.

అంబిడెంట్‌ మార్కెటింగ్‌ కేసుకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేనందున.. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌లో గాలి కోరారు. రాజకీయ ఉద్దేశాలతోనే తనను వివాదంలో ఇరికించారని ఆయన తన  పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే అంబిడెంట్‌ డీల్‌లో భాగంగా సీసీబీ పోలీసులు పక్కా సమాచారంతో వారం రోజుల క్రితమే గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేయాలని భావించారు. కానీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులకు కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడ సూచించినట్లు తెలుస్తోంది.  దీంతో ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు వేచిచూసిన సీసీబీ.. అదేరోజున రంగంలోకి దిగింది.

ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా

ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుతో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన తరపు న్యాయవాది హనుమంతరాయ బెంగళూరు హైకోర్టులో మనవి చేశారు. అయినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అరెస్టు చేస్తారని మీరు ముందుగానే ఊహించుకుంటున్నారా ? అంటూ గాలి న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

మరోవైపు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే విషయంలో ఏమైనా అభ్యంతరలు ఉంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సీసీబీ పోలీసులకు కూడా హైకోర్టు సూచించింది.

 

 

more news

- Advertisement -