గౌతమ్ గంభీర్ మరో రికార్డ్! ఆస్తుల విలువెంతో తెలుసా?

12:28 pm, Thu, 25 April 19
Gautam Gambhir Latest News, BJP Latest News, Newsxpressonline

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీ నుంచి బరిలోకి దిగిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారీ స్థాయిలో ఆస్తులను డిక్లేర్డ్ చేశాడు. తన ఆస్తి 147 కోట్ల రూపాయలు అని గంభీర్ పేర్కొనడం విశేషం. గత ఏడాదిలో తన ఆదాయం 12 కోట్ల రూపాయల వరకూ ఉందని గంభీర్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

విశేషం ఏమిటంటే.. దాదాపు శ్రీమంతులే పోటీచేసే ఢిల్లీలో అత్యంత ధనికుడు అయిన అభ్యర్థిగా నిలుస్తున్నాడు గౌతమ్ గంభీర్. ఈ రేంజ్‌లో ఆస్తుల ప్రకటనలు చేసిన ఢిల్లీ ఎంపీ క్యాండిడేట్లు ఎవరూ లేరట.

చదవండి: పాండ్యా, కేఎల్ రాహుల్‌కి బీసీసీఐ షాక్!

గంభీర్ చాలా కాలంగా బీజేపీ అనుకూల వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కాస్త నోరెత్తిన వారిని ఎవరినైనా ‘పాకిస్తాన్ వెళ్లిపోండి..’ అంటూ నిందిస్తూ వచ్చాడు ఈ క్రికెటర్.

దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి…

అంతర్జాతీయ క్రికెట్ నుంచి కాస్త అవమానకరంగానే గంభీర్ తప్పుకోవాల్సి వచ్చింది. జాతీయ జట్టులో స్థానం కోల్పోయి.. ఆ తర్వాత దాన్ని మళ్లీ సాధించుకోకముందే గంభీర్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాల్సి వచ్చింది.

టీమిండియా కెప్టెన్ కొహ్లీతో ఏమాత్రం పడకపోవడం కూడా గంభీర్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కకుండా చేసిందనేది ఒక వాదన. గంభీర్ క్రికెట్‌లో దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి.  ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అనడం ఇతడికి అలవాటు.

అంతర్జాతీయ మ్యాచ్‌లలోనేగాక ఇదే తీరును ఐపీఎల్‌లో కూడా కొనసాగించాడు. దేశీయ ఆటగాళ్లతో కూడా గొడవలు పడ్డాడు. ఇలాంటి నేపథ్యం ఉన్న గంభీర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశాడు! అటు క్రికెట్ గ్లామర్, ఢిల్లీలో స్థానికత, జాతీయవాద ట్వీట్లు.. ఇవన్నీ ఇతడిని ఎంపీగా చేస్తాయేమో చూడాలి!

చదవండి: నీ అంతు చూస్తా! కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్!