మొత్తానికి మట్టుబెట్టారు.. దూబే హతం.. ఆసుపత్రికి దూబే భార్య, కుమారుడు

- Advertisement -

 లక్నో: 8 మంది పోలీసులను మట్టుబెట్టిన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేను ఎట్టకేలకు హతమయ్యాడు. ఉజ్జయినిలో పోలీసులకు చిక్కిన దూబేను కాన్పూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో కారు బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన దూబే పోలీసుల వద్దనున్న 9 ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు.

దీంతో దూబే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. అనంతరం దూబే మృతదేహాన్ని కాన్పూరులోని ఎల్ఎల్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. మరోవైపు దూబే భార్య, కుమారుడు ఆసుపత్రికి చేరుకున్నారు.

- Advertisement -

జులై 2న కాన్పూరులోని బిక్రూ గ్రామంలో ఉన్న వికాశ్ దూబేను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బృందంపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్‌ఐలను, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు.

- Advertisement -