గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత !

8:33 pm, Sun, 17 March 19
manohar-parrikar

గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

కొంతకాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్లివచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్,ముంబై,గోవాలోనూ ఆయన ట్రీట్మెంట్ పొందారు. అప్పటికే సమస్య తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా పారికర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన బతికే అవకాశాలు తక్కువంటూ ప్రచారం జరిగింది. మోడీ కేబినెట్ లో రక్షణశాఖమంత్రిగా పారికర్ పనిచేశారు.

ఇటీవల ముక్కులో పైపుతోనే విధులకు హాజరై అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పారికర్ గతంలో దేశ రక్షణ మంత్రిగానూ విశేష సేవలందించారు

1994లో పారికర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోవాలోని మపుసాలో పారికర్ జన్మించారు.2000లో గోవా సీఎంగా తొలిసారిగా పారికర్ బాధ్యతలు చేపట్టారు. అయన 2000 నుంచి 2002 వరకు, 2002 నుంచి 2005 వరకు, 2012 నుంచి 2014 వరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ తరువాత 2017 మార్చిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవి ప్రమాణం చేశారు. పారికర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్రమోడీ,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ నేతలు,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. పారికర్ మృతి చెందిన వార్త తెలిసి తాను చాలా భాధపడ్డానని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. దేశం,గోవా ప్రజలు పారికర్ ను మర్చిపోలేరన్నారు.