వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. జూన్ 30 వరకు బేఫికర్!

6:35 pm, Tue, 31 March 20

న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 1, ఆ తర్వాత గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, రిజిష్ట్రేషన్ పత్రాలు, వాహనాల పేపర్లు వంటి వాటి చెల్లుబాటు గడువును పొడించింది.

ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ ఇవన్నీ జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
అంటే.. మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 5తో ముగిసినప్పటికీ అది జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది.

తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వ నిర్ణయం బోల్డంత ఉపశమనం కలిగించింది.

గతేడాది సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు సవరణ చట్టంలో భాగంగా భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5వేల జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జూన్ 30 వరకు జరిమానాల బాధ లేకుండా తిరిగే అవకాశం లభించింది.

ప్రభుత్వ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దీనివల్ల అత్యవసర, నిత్యావసర సరుకుల రవాణాలు ఇబ్బందులు, అవాంతరాలు ఎదురుకావని తెలిపింది.