ప్రత్యర్దులకి గంబీర్ సవాల్! నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా?

12:08 pm, Fri, 10 May 19
gautam gambhir

న్యూఢిల్లీ : ప్రస్తుతం భారతదేశ రాజకీయం రోజు రోజుకి మరింతగా వేడెక్కిపోతుంది. ఇప్పటికే ఐదు దశలలో ఎన్నికలు ముగిసిపోయాయి. ఈ సయమంలో విమర్శలు , ప్రతి విమర్శలతో నేతలు హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లో రాజకీయం మరింత వేడెక్కుతోంది.

క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తనకు వ్యతిరేకంగా కులం పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు రాసి ఉన్న కరపత్రాలను పంచారని ఆప్ అభ్యర్థి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందించారు. నాపై చేస్తున్న ఆరోపణలకు రుజువు ఉంటే తీసుకురావాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఆప్ అభ్యర్థి అతిషి లకు సూచించారు.

ఒకవేళ ఆరోపణలు నిజమైతే కేజ్రీవాల్ తోనే రాజీనామా పత్రాన్ని రాయించి ప్రజల సమక్షంలో ఆ లేఖపై సంతకం చేస్తానని గంభీర్ స్పష్టం చేశారు. వారు తగిన ఆధారాలు చూపిస్తే ఇప్పటికిపుడే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నా.

మే 23నే రిటైర్ మెంట్ తీసుకుంటా. ఒకవేళ నాపై చేస్తున్న ఆరోపణలు తప్పని రుజువైతే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారా అని కేజ్రీవాల్ ను గంభీర్ సవాల్ విసిరాడు.