రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు అంబులెన్స్‌లో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

- Advertisement -

గాంధీనగర్‌: రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అంబులెన్స్‌లో వచ్చారు. గుజరాత్‌లో జరిగిందీ ఘటన. మతార్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసరిసిన్హ్‌ జెసాంగ్‌భాయ్ సోలంకి ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. నేడు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. అంబులెన్స్‌లో అసెంబ్లీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

8 రాష్ట్రాల్లో 19 స్థానాలకు నేడు ఎన్నికలు ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో 4 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ ముగియడంతో అధికారులు కౌంటింగ్‌ ప్రారంభించారు. మరికాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -
- Advertisement -