డేరా బాబాకు బెయిల్ దొరికింది.. అయినా జైల్లోనే, ఎందుకో తెలుసా?

dera-baba
- Advertisement -

dera-baba

పంచకుల: డేరా బాబా గుర్తున్నాడా? అదే.. డేరా సచ్ఛా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్. సాధ్వీలపై అత్యాచారం, ఇంకా పలు కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న డేరా బాబాకు మొత్తానికి బెయిల్ మంజూరైంది. అయినా పాపం, ఆయనకు శ్రీక‌ృష్ణ జన్మస్థానం తప్పడం లేదు.

- Advertisement -

అవును, గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు ఓ కేసులో శుక్రవారమే పంచకుల సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో అత్యాచారం కేసులో కూడా ఆయన దోషి కావడంతో జైలు శిక్ష అనుభవించక తప్పడం లేదు.

అంతకుముందు కూడా ఆ కేసులో ఆగస్టు 23న డేరా బాబా బెయిలు పిటిషన్ పెట్టుకోగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో డేరాబాబా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిని శుక్రవారం విచారించిన సీబీఐ కోర్టు జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

తన వద్ద పని చేసిన ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండడంతో, ఈ కేసులో బెయిల్ మంజూరు అయనా ప్రయోజనం లేకుండా పోయింది.

- Advertisement -