దేశంలో ‘కరోనా’ కల్లోలం, ఒక్కరోజులో 15,968 పాజిటివ్ కేసులు.. 465 మంది మరణం

Central Government likely to be re-impose lockdown in some states
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో రోజూ పాత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. 

గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశ వ్యాప్తంగా ఏకంగా 15,968 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకావడం అందరిలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

- Advertisement -
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లు కరోనా! ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్లూ చికిత్సలో…

ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో బుధవారం నాడు నమోదైనవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు దేశ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 

తాజాగా కరోనా కాటుకు బుధవారం ఒక్కరోజే 465 మంది బలయ్యారు. దేశ వ్యాప్తంగా మరణాల రేటు 3.17 శాతానికి చేరుకుంది. 56.70 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

దేశంలో రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో 60 శాతానికిపైగా కేసులు నమోదు అవుతున్నాయి. 

మళ్లీ మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ…

కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా ఇక్కడ 3,214 కేసులు నమోదుకాగా, 248 మంది మరణించారు.

మరోవైపు దేశ రాజధాని నగరం ఢిల్లీ కూడా మహారాష్ట్రతో పోటీ పడుతోంది. గతంలో ఢిల్లీ ఒకసారి మహారాష్ట్రను మించిపోగా.. మళ్లీ బుధవారం కూడా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రను దాటేసింది. 

బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 3,947 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నెలలో ఇప్పటికి ఢిల్లీ ఇలా మహారాష్ట్రను మించిపోవడం రెండోసారి.

ఇక రికవరీ విషయానికొస్తే.. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్.. తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా వ్యాధిగ్రస్థుల్లో 70 శాతానికిపైగా కోలుకుని ఆసుపత్రుల నుంచి ఢిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు.

 

- Advertisement -