ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారత్

- Advertisement -

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటేశాయి.

ఫలితంగా ఆసియా-ఫసిఫిక్ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా భారత్ మరోమారు ఎన్నికైంది. ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి.

- Advertisement -

2021-22 కాలానికి భారత్‌ను ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నట్టు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.

భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. అలాగే భారత్ గతంలో 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992, 2011-12లలో విజయం సాధించింది.

- Advertisement -