దేశంలో కరోనా మరణ మృదంగం.. మరణాల్లో ప్రపంచంలోనే 9వ స్థానం!

104-positive-cases-jewellery-store-becomes-covid-19-hotspot-in-tamil-nadu
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి గతంలో ఎన్నడూ లేనంతగా చెలరేగిపోతోంది. ప్రతి రోజు 10 వేలకు మించి కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరోవైపు, మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 9,195 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

- Advertisement -

ఫలితంగా మరణాల జాబితాలో భారతదేశం ప్రపంచ జాబితాలో 9వ స్థానికి చేరుకున్నట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

ఇక, కేసుల విషయానికి వస్తే నాలుగో స్థానంలో ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 11,929 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1,62,378 మంది కోలుకున్నట్టు కేంద్రం వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇంకా, 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు, ఢిల్లీలో వరుసగా మూడో రోజూ కేసులు 2 వేలు దాటాయి. దేశ రాజధానిలో అత్యధికంగా 2,224 మంది కరోనా బారినపడటం గమనార్హం. మహారాష్ట్రలో కొత్తగా 3,390 కేసులు వెలుగుచూడగా, 120 మంది చనిపోయారు.

- Advertisement -