భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు

india-reports-14821-cases-in-last-24-hrs
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నియంత్రణలోకి రాకపోగా రోజురోజుకీ మరింత పెరుగుతోంది. నిత్యం భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. 

గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,821 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 4,25,282కు చేరుకుంది. 

- Advertisement -
చదవండి: రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!

ఇక ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని 2,37,195 మంది డిశ్చార్జ్ కాగా, వివిధ ఆసుపత్రులలో ఇంకా 1,75,387 మంది చికిత్స పొందుతూనే ఉన్నారు. 

కరోనా కాటుకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,699 మంది బలయ్యారు. ఆదివారం ఒక్కరోజే 445 మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,43,267 పరీక్షలు నిర్వహించారు. 

చదవండి: గుడ్‌న్యూస్: కరోనాకు అడ్డుకట్ట వేసే ‘కోవిఫర్’ ఉత్పత్తికి డీసీజీఐ అనుమతి

 

- Advertisement -