గాల్వన్ లోయ ఘటన: అమరులైన భారత జవాన్లు వీరే, పేర్లు విడుదల చేసిన సైన్యం…

- Advertisement -

న్యూఢిల్లీ: లద్దాఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.

భారత్-చైనా సైనిక బలగాల నడుమ చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి విదితమే. 

- Advertisement -

ఈ ఘటన యావత్ దేశ ప్రజలను కలచివేసింది. మృతుల్లో ఒకరు కర్నల్‌కాగా మిగిలిన వారు నాయిబ్ సుబేదార్, హావల్దార్, సిపాయి హోదాలో ఉన్న వారు. 

మరోవైపు భారత్-చైనాల నడుమ తీవ్ర ఘర్షణ నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల నేతలతో  ప్రధాని చర్చించనున్నట్లు పీఎంఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. 

అమరులైన సైనికులు వీరే…

బి.సంతోష్‌బాబు (కర్నల్) – సూర్యాపేట, తెలంగాణ
నాధూరాం సోరెన్ (నాయిబ్ సుబేదార్) – మయూర్‌బంజ్, ఒడిశా
మన్‌దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) – పటియాలా, పంజాబ్
సత్నమ్ సింగ్ (నాయిబ్ సుబేదార్) – గురుదాస్‌పూర్, పంజాబ్
కె.పళని (హావల్దార్) – మధురై, తమిళనాడు
సునీల్ కుమార్ (హావల్దార్) – పాట్నా, బీహార్
బిపుల్ రాయ్ ( హావల్దార్) – మీరట్, ఉత్తర్‌ప్రదేశ్
దీపక్ కుమార్ (సిపాయి) – రీవా, మధ్యప్రదేశ్
రాజేష్ అరంగ్ (సిపాయి) – బిర్భుం, పశ్చిమబెంగాల్
కుందన్ కుమార్ ఓఝూ (సిపాయి) – సాహిబ్ గంజ్, ఝార్ఖండ్
గణేష్ రామ్ ( సిపాయి) – కాంకేర్, ఛత్తీస్‌గఢ్
చంద్రకాంత ప్రధాన్ ( సిపాయి) – కంధమాల్, ఒడిశా
అకుశ్ ( సిపాయి) – హమిర్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్
గుర్విందర్ ( సిపాయి) – సంగ్రూర్, పంజాబ్
గురుతే‌జ్ సింగ్ ( సిపాయి) – మాన్సా, పంజాబ్
చందన్ కుమార్ ( సిపాయి) – భోజ్‌పూర్, బీహార్
కుందన్ కుమార్ (సిపాయి) – సహస్ర, బీహార్
అమన్ కుమార్ ( సిపాయి) – సమస్థపూర్, బీహార్
జై కిశోర్ సింగ్ ( సిపాయి) – వైశాలి, బీహార్
గణేష్ హన్స్‌దా ( సిపాయి) – తూర్పు సింగ్భూం, జార్ఖండ్

చదవండి: చైనాతో ఘర్షణలో.. 23 మంది భారత సైనికుల వీరమరణం?
చదవండి: భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ.. అమరుడైన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు
- Advertisement -