థాయ్‌లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్ టెక్కీ ప్రగ్యా దుర్మరణం

12:37 pm, Fri, 11 October 19

భోపాల్: థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రగ్యా పలివాల్(29) దుర్మరణం పాలైంది. బెంగళూరులో ఉన్న హాంగ్‌కాంగ్ కంపెనీలో ప్రగ్యా ఉద్యోగం చేస్తోంది. కంపెనీ వార్షిక సమావేశం కోసం ఇటీవలే ఆమె థాయిలాండ్ వెళ్లింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

బెంగళూరులోని ఆమె రూమ్మేట్‌కు ప్రమాద వార్త తెలియగా, ఆమె ఆ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేసింది. కుమార్తె మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు కున్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే థాయ్‌లాండ్‌లోని  భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.