విషాదం: ప్రాణం తీసిన ఉపవాసం.. గుండెపోటుతో యువతి హఠాన్మరణం!

11:55 am, Fri, 6 September 19
Jain woman on fast dies of heart attack

ముంబై: వారం రోజుల ఉపవాస దీక్ష ఓ యువతి నిండుప్రాణాలు బలితీసుకుంది. జైన సాంప్రదాయ ప్రకారం 8 రోజులపాటు ఉపవాస దీక్షకు పూనుకున్నఆమె ఏడో రోజైన బుధవారం గుండెపోటుకు గురై హఠాన్మరణ పాలైంది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని మటుంగా ప్రాంతంలో చోటు చేసుకుంది.

చదవండి: ట్రాఫిక్ జరిమానా కట్టమన్నారని.. బైక్‌ను తగలెట్టేశాడు!

మృతురాలి బంధువుల కథనం ప్రకారం… గుజరాత్‌లోని మటుంగాలో నివాసం ఉంటోన్న ఏక్తా అశుభాయి గాలా(25) కొద్దిరోజుల క్రితం.. కచ్ కోట్ది మహదేవపురిలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె జైన సాంప్రదాయం ప్రకారం గత నెల 27 నుంచి ఎనిమిది రోజుల ఉపవాస దీక్షకు పూనుకుంది.

ఐదు రోజులకే ఆమె అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు.. ఏక్తాను వెంటనే చికిత్స నిమిత్తం కచ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్‌తోపాటు స్థానిక జైన మత గురువు జైన్ మహారాజ్ కూడా ఉపవాస దీక్షను విరమించాలని ఆమెకు సూచించారు. కనీసం రోజులో ఒక పూటైనా భోజనం చేయాలని చెప్పారు.

అయితే, అందుకు ఏక్తా అంగీకరించలేదు. తాను ఉపవాసాన్ని కొనసాగిస్తానని వారితో చెప్పింది. సెప్టెంబర్ 3న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఆమెకు సెలైన్ అమర్చారు. అయినా సరే.. వేడి నీటిని మాత్రమే తాగుతూ ఆమె తన ఉపవాస దీక్షను కొనసాగించింది. ఏడో రోజైన బుధవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అశుభాయి గాలా మరణించింది.

చదవండి: జియో గిగా ఫైబర్‌లో ఈ ప్లాన్ తీసుకుంటే.. 43 అంగుళాల టీవీ ఉచితం!