బీజేపీలోకి జయప్రద!: ఎవరిపై పోటీగా అంటే..?

6:05 pm, Mon, 25 March 19
Jaya Prada Latest News, BJP Latest News, Newsxpressonline

లక్నో: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రముఖ సినీ నటి జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె సోమవారం బీజేపీలో చేరతారని.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

గతంలో సమాజ్ వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

టీడీపీతో రాజకీయ ప్రస్థానం..

కాగా, ఇంతకుముందు ఒకేపార్టీలో కొనసాగిన జయప్రద-ఆజంఖాన్ మధ్య బద్ద వైరం నెలకొంది. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కాగా, టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం ఉత్తరాది రాజకీయాల్లోకి వెళ్లారు.

సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్ నటిగా కూడా మంచి పేరుండటంతో 2004లో ఆమెకు రాంపూర్ టికెట్‌ను ఎస్పీ కేటాయించింది. దీంతో ఆమె మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఎస్పీ నాయకత్వాన్ని విభేదించి తన సన్నిహితుడైన అమర్ సింగ్‌తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్ల అమర్ సింగ్‌ను గాడ్ ఫాదర్‌గా చెప్పుకుంటారు జయప్రద.