ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్‌కి రివర్స్ షాక్ ఇచ్చిన స్టాలిన్…

9:06 pm, Mon, 13 May 19

చెన్నై: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుని ముమ్మరం చేసే భాగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కి షాక్ తగిలింది. ఫెడరల్ ఏర్పాటుపై చర్చించేందుకు కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

గంటన్నరకు పైగా జరిగిన ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని స్టాలిన్‌ను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

చదవండి: మళ్ళీ ఆ సీటు వైసీపీ ఖాతాలోకే….!

కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని కోరిన స్టాలిన్…

‌లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే కూటమిగా పోటీ చేశాయి. ఇక ఇదే విషయాన్ని స్టాలిన్‌ కేసీఆర్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లనున్నట్టు స్టాలిన్ స్పష్టం చేశారని సమాచారం.

ఏది ఏమైనా కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని, అయితే ఫెడరల్ ఫ్రంట్ స్పూర్తికి మాత్రం మద్దతిస్తామని స్టాలిన్ చెప్పినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కూటములకు మెజారిటీ రాదనే నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కీలకం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

అందులో భాగంగానే తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన కేసీఆర్ …నేడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో స్టాలిన్ కేసీఆర్‌కి  రివర్స్‌లో….కుదిరితే కాంగ్రెస్ కూటమికి మద్ధతు ఇవ్వమని అడిగి షాక్ ఇచ్చారు.

చదవండి: మనదేశంలో గాడ్సేనే తొలి హిందూ టెర్రరిస్ట్: కమల్ సంచలన వ్యాఖ్యలు