మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు, రాత్రిపూట కర్ఫ్యూ యధాతథం…

prime minister narendra modi address to the nation on covid19 lockdown
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది.

లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

చదవండి: షాకింగ్: వారు మరణిస్తుంటే చూడడం ఓ అద్భుతమే: మళ్లీ నోరు జారిన ట్రంప్…

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.

కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.

చదవండి: లాక్‌డౌన్ మరో రెండు వారాల పొడిగింపు.. కేంద్రం ఆలోచన ఇదే!
 
- Advertisement -