దేశం‌లో లక్ష కరోనా కేసులు నమోదైన తొలిరాష్ట్రం ఇదే..

- Advertisement -

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో ఇక్కడ కొత్తగా 3,493 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఈ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,141కు చేరింది.

- Advertisement -

దేశంలో లక్ష కరోనా కేసులు నమోదైన తొలి రాష్ట్రం ఇదే. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య కూడా 3,717కు చేరినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -