ఇండియాస్‌ అమేజింగ్‌ ఫైటర్స్‌! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…

11:53 am, Tue, 26 February 19
Rahul_Jan16banerjeemamata

air force attack

పుల్వామా: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్‌ మాట నిలబెట్టుకుంది. 46 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది.

12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 విజయవంతంగా పూర్తి చేసి… దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించారంటూ భారత వాయుసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రతిపక్ష నేతల ప్రశంసలు…

భారత్ సర్జికల్‌ స్ట్రైక్స్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. భారత వైమానిక దళ పైలట్లకు సలాం అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేయగా.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ… భారత వైమానిక దళాన్ని(ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌) అమేజింగ్‌ ఫైటర్స్‌గా అభివర్ణించారు.

ఈ మేరకు..‘ఐఏఎఫ్‌ అంటే ఇండియాస్‌ అమేజింగ్‌ ఫైటర్స్‌ జై హింద్‌’ అని ట్వీట్‌ చేశారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌…‘పాక్‌ ఉగ్రవాదులపై దాడి చేసి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన పైలట్లకు సెల్యూట్‌ చేస్తున్నా..’ అని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం

విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…

పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…