దేశంలో మళ్లీ లాక్‌డౌన్? సోషల్ మీడియాలో వదంతులపై స్పష్టత ఇచ్చిన ప్రధాని మోడీ…

- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న వార్తలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టత ఇచ్చారు.

దేశంలో అన్‌లాక్-1 మొదలైన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాయి. రోజూ వేలల్లో పెరుగుతూ పోతున్నాయి.

- Advertisement -

దీంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ వార్తలపై ప్రధాని విస్పష్ట ప్రకటన చేశారు.

మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచనేదీ లేదని పేర్కొన్నారు. దేశంలో అన్‌లాక్‌ 1.0 సాగుతోందని, అన్‌లాక్‌ 2.0 ఎలా అమలుచేయాలనే దానిపై చర్చించాలని నేడు సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరగా ప్రధాని ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.

కరోనా కట్టడికి పరీక్షల సామర్థ్యం పెంచడంతో పాటు ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని ప్రధాని కోరారు.

- Advertisement -