74వ స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ…

Mod hoists Tricolour Flag on the Eve of 74th Independence Day Celebration
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 74వ స్వితంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈసారి పంద్రాగస్టు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. 

- Advertisement -
చదవండి: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 5 నెలలపాటు ఉచిత డేటా!

అనంతరం అక్కడ్నించి ఎర్రకోటకు చేరుకుని తొలుత సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఆపైన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఆ తరువాత ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పంద్రాగస్టు వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

కరోనా దేశాన్ని కమ్ముకున్న వేళ అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

- Advertisement -