కాంగ్రెస్ వాళ్ళు నన్ను చంపేయాలన్నంత కసితో ఉన్నారు….

8:48 am, Thu, 2 May 19

భోపాల్: ప్రధాని మోడీ మరోసారి కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యపదేశ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ నేతలు తనను చంపేయాలన్నంత కసితో రగిలిపోతున్నారని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు ఉదాహరణగా ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత మాట్లాడిన మాటలని మోడీ చెప్పారు. ఆ కాంగ్రెస్ నేత ‘మోడీని తంతే సరిహద్దులకు అవతల పడి చావాలని’ అన్నాడని గుర్తు చేశారు. ఇక దీనిని బట్టి వారికి తనపై ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

చదవండి: ‘థాంక్యూ బేటా..’: ప్రసంగం మధ్యలో.. చిన్నారికి థాంక్స్ చెప్పిన మోడీ, ఏం జరిగిందంటే…

కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగతంగా ఎక్కడలేని ద్వేషాన్ని పెంచుకున్నారని, కానీ తనకు మాత్రం ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు. 55 ఏళ్ల కాంగ్రెస్ వంశపాలన బాగుందో, 55 నెలల చాయ్‌వాలా పాలన బాగుందో చెప్పాలని ప్రజలను కోరారు.

అలాగే  పేలుళ్ల తర్వాత శ్రీలంక జకీర్ నాయక్ టీవీని నిషేధించిందని… కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఆయనను శాంతిదూతగా పేర్కొంటున్నాయని అన్నారు. ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నేతలు అసలు విపక్ష నేతలు కూడా కాలేరన్నారు.