ముంబైలో దారుణంగా పెరిగిపోతున్న కేసులు.. 77 వేలు దాటేసిన వైనం

- Advertisement -

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ముంబై నగరంలోనే అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.

మంగళవారం నాటికి ముంబైలో 77 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు కొత్తగా 903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,197కి చేరింది. ప్రస్తుతం నగరంలో 28,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 44,170 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -