ఝార్ఖండ్ మంత్రికి కరోనా.. హోం క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి

- Advertisement -

రాంచీ: ఝార్ఖండ్ మంత్రి మిత్లేశ్ ఠాకూర్‌కు కరోనా సోకడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తనకు తాను హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అలాగే, ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సీఎం అధికార నివాసంలోకి ఇతరుల ప్రవేశంపై నిషేధం విధించారు.

కరోనా బారినపడిన మంత్రి మిత్లేశ్ అంతకుముందు ముఖ్యమంత్రి సోరెన్‌ను కలవడంతో ఆయన స్వీయ హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల మంది కరోనా మహమ్మారి బారినపడగా, 22 మంది కరోనా కాటుకు బలయ్యారు.

- Advertisement -
- Advertisement -