సచిన్ పైలట్‌కు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమన్న అత్యున్నత ధర్మాసనం

- Advertisement -
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
 
అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాజస్థాన్ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
 
 
రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడం ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించినట్టయింది. 
- Advertisement -