కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

- Advertisement -

తిరువనంతపురం: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గత వారం ఫరీద్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

ఫరీద్‌ను భారత్ కు అప్పగించాలని దుబాయ్ పోలీసులను ఇంటర్ పోల్ అధికారులు కోరారు.

 తాను 20 సార్లు దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు విచారణలో ఫరీద్ అంగీకరించాడు. దీనికి సంబంధించి కేరళ దౌత్య కార్యాలయం నుంచి తనకు పూర్తి స్థాయిలో సహకారం అందినట్లు చెప్పాడని సమాచారం.

త్వరలోనే దుబాయ్ పోలీసు అధికారులు ఫరీద్ ను ఇంటర్ పోల్ అధికారులకు అప్పగించే అవకాశం ఉంది.

ఫరీద్ దుబాయ్ లో ఏం చేస్తుంటాడన్న కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. దుబాయ్‌లో అతడు చిన్న వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

కుటుంబం కూడా పూర్తిస్థాయిలో అక్కడే సెటిల్ అయినట్లు సమాచారం. ఫరీద్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. అతని పాస్‌పోర్ట్‌ను అక్కడి పోలీసులు సీజ్ చేశారు.

- Advertisement -