యానాంలో అకస్మాత్తుగా మేఘాల్లోకి చేపలు, రొయ్యలు.. వీడియో ఇదిగో!

- Advertisement -

పుదుచ్చేరి: యానాంలోని అద్భుతం చోటుచేసుకుంది. అయ్య‌నార్ న‌గ‌ర్ ప్రాంతంలో చేపలు, రొయ్యలు ఒక్కసారిగి నింగికెగశాయి. ఇది చూసినవారు ఓ పక్క ఆశ్చర్యం, మరోవైపు భయంతో పరుగులు తీశారు. ఇక్కడి రొయ్యల చెరువులో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా టోర్నడో పుట్టడమే కారణం. కొద్దిసేపే అయినా బీభత్సం సృష్టించింది.

టోర్నడో దెబ్బకు చెరువులోని చేపలు, రొయ్యలు ఒక్కాసారిగా పైకి ఎగిరాయి. వాటితో పాటు ఒడ్డునే ఉన్న వలలు, ఇతర సామగ్రి కూడా సుడిగాలికి పైకి లేచి దాంట్లోనే సుడులు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

- Advertisement -