ఢిల్లీలో కరోనా విలయం… ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న నగరంగా రికార్డు

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా కేసుల విషయంలో దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబైని దాటేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 3,947 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో గురువారం నాటికి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,390కి చేరింది. ఫలితంగా ఇప్పటి వరకు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న ముంబైని దాటేసి ఆ స్థానాన్ని ఆక్రమించింది.

- Advertisement -

ముంబైలో ఇప్పటి వరకు 69,528 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు 70 వేలకు పైగా కేసులతో ముంబైని ఢిల్లీ వెనక్కి నెట్టేసింది.

మే 29 నుంచి ఢిల్లీలో ప్రతి రోజు వెయ్యి మందికిపైగా కరోనా బారినపడుతున్నారు. మే 31 నుంచి కరోనా వ్యాప్తి మూడు రెట్ల మేర పెరిగింది.

జూన్‌ తొలి వారం తర్వాత ఢిల్లీలో కరోనా కేసుల నమోదు రేటు 5.25 శాతానికి చేరగా, ముంబైలో 3 శాతం కంటే తక్కువగానే ఉంది.

ఈ నేపథ్యంలో జులై ఆరంభంలో కరోనా కేసుల సంఖ్యలో ముంబైని ఢిల్లీ దాటవచ్చని అంచనా వేశారు.

అయితే, అంతకంటే వారం ముందే ముంబైని దాటేసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.

కరోనా వైరస్‌కు మూలమైన చైనాలోని వుహాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్యను జూన్‌ 9న ముంబై దాటేయగా, తాజాగా ఢిల్లీ కూడా వుహాన్‌ను అధిగమించింది.

 

- Advertisement -