న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ‘ఒప్పో ఎ72 5జీ’ని చైనా మార్కెట్లో విడుదల చేసింది. గత నెల విడుదల చేసిన ‘ఒప్పో ఎ72’ 4జీ వేరియంట్‌ను విడుదల చేయగా, తాజాగా దీనిని లాంచ్ చేసింది.
4జీ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉపయోగించగా, 5జీ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఉపయోగించింది. అలాగే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కోసం హోల్ పంచ్ డిజైన్ కెమెరాను ఏర్పాటు చేసింది.
ఒప్పో ఎ72 5జీలో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీతో ఒకేఒక్క వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 20,200 ఉండే అవకాశం ఉంది.
అయితే, ఒప్పో ఎ72 5జీ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎప్పుడు తీసుకొచ్చేదీ ఒప్పో స్ఫష్టత ఇవ్వలేదు.
స్పెసిఫికేషన్లు: కలర్ ఓస్ 7.2, 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 5జీకి సపోర్ట్ చేసే డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 16 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ సెన్సార్‌తో హోల్‌పంచ్ డిజైన్, 128 జీబీ అంతర్గత మెమొరీ, 4,040 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ వంటివి ఉన్నాయి.