భారత పైలట్‌‌పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!

pak vs india
- Advertisement -

pak vs india

ఇస్లామాబాద్: భారత వైమానిక దళానికి చెందిన పైలట్‌ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం ఆయనను హింసించిన దృశ్యాలు సోషల్ మీడియా పేజీల్లో హల్‌‌చల్ చేస్తున్నాయి. నీళ్లు పారుతున్న ఓ కాలువ సమీపంలో పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం అతనిని చుట్టుముట్టింది.

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం….

నీళ్లలో పడేసి, చేతులతో ముఖంపై కొడుతూ.. కాళ్లతో తన్నుతూ పాక్ సైన్యం అమానుషంగా ప్రవర్తించింది. వారి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారనే అక్కసుతో ఇలా తెగబడి ప్రవర్తిస్తున్నారని ఆ వీడియో చూసిన భారత నెటిజన్లు కారాలుమిరియాలు నూరుతున్నారు.

ఏదేమైనా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ఈ వీడియోా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ సైనికులు ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని మండిపడుతున్నారు.

భారత్ కు చెందిన ఐఏఎఫ్ పైలెట్ విక్రమ్ అభినందన్ ని సజీవంగా పట్టుకున్నామని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఐఏఎఫ్ పైలెట్ విక్రమ్ అభినందన్‌ స్వస్థలం కేరళ. అభినందన్ తండ్రి వర్థమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్. అభినందన్ విద్యాభ్యాసం తిరుప్పూర్ జిల్లాలో సాగింది. చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందాడు.

చదవండి: మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, భారత్ ఖండన

- Advertisement -