ఆశ్చర్యం: పాకిస్తాన్‌‌కు వెళుతూ ‘భగవద్గీత’ తీసుకెళ్లిన ఖైదీ!

pakistan prisoner takes to bhagavad-gita into him in Varanasi
- Advertisement -

pakistan prisoner takes to bhagavad-gita into him in Varanasi

వారణాసి: భారత జైల్లోనుంచి విడుదలైన పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ చేసిన పని భారత సంస్కృతి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచనికి చాటి చెప్పింది. పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన జలాలుద్దీన్ గత 16 ఏళ్లుగా వారణాసి సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవించాడు.  శిక్ష కాలం ముగియడంతో ఈ ఆదివారం జైలు నుంచి విడుదలైన అతడు పాకిస్తాన్‌కు వెళుతూ.. తన వెంట హిందువుల పవిత్ర గ్రంథం ‘భగవద్గీత’ను తీసుకెళ్లాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే.. 2001లో వారణాసి కంటోన్మెంట్‌ ప్రాంతంలో జలాలుద్దీన్‌ వద్ద అనుమానాస్పద పత్రాలు లభించడంతో వారణాసి పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి వారణాసి కంటోన్మెంట్‌ చెందిన మ్యాప్‌తోపాటు, ఇతర కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిపై న్యాయవిచారణ చేపట్టిన కోర్టు అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సెంట్రల్ జైల్లో ఉంటూనే…

జలాలుద్దీన్‌ జైల్లోకి వచ్చినప్పుడు.. అక్కడ ఉన్నవారిలో అతనొక్కడే హైస్కూల్‌ విద్యను పూర్తి చేశాడు. సెంట్రల్ జైల్లో ఉంటూనే అతను ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంఏ పట్టా పొందాడు. అలాగే ఎలక్ట్రీషియన్‌ కోర్సు కూడా నేర్చుకున్నాడు.  గత మూడేళ్లుగా సెంట్రల్ జైల్లో జరుగుతున్న క్రికెట్‌ పోటీలకు అంపైర్‌గా కూడా వ్యవహరించాడు.

జలాలుద్దీన్‌ను వారణాసి సెంట్రల్ జైల్ నుంచి తీసుకువెళ్లిన భారత్ ప్రత్యేక బృందం అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్‌ అధికారులకు అతన్ని అప్పగించనుంది. గడచిన 16 ఏళ్లలో జలాలుద్దీన్‌ ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చినట్టు వారణాసి జైలు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -