మరికాసేపట్లో కేదార్‌నాథున్ని దర్శించుకోనున్న ప్రధాని మోడీ!

9:32 am, Sat, 18 May 19
KEDARINATH

కేదార్‌నాథ్: ప్రధాని మోదీ కాసేపట్లో కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఐదురోజుల ముందు కేదార్‌నాథ్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మోదీ యాత్రకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆదివారం జరగనుంది. అయితే మోదీ కేదార్‌నాథ్ దర్శనం కూడా కోడ్ ఉల్లంఘనే అవుతుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం విపక్షాల వాదనను తోసిపుచ్చింది. దీంతో మోదీ యాత్రకు రూట్ క్లియర్ అయ్యింది.

కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బనీ గుహలో ధ్యానం చేసి.. పరమశివుడికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రేపు బద్రీనాథ్‌ను దర్శించుకోనున్నారు. కేదార్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణ పనులను ప్రధాని పరిశీలించనున్నారు.

వరదల కారణంగా దెబ్బతిన్న కేదార్‌నాథ్ ఆలయానికి పునర్‌వైభవం తీసుకొస్తానని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు సమయం చిక్కినప్పుడల్లా ఆయన కేదార్‌నాథ్‌కు వెళ్తూ.. పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. మోదీ యాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.