అరుదైన గౌరవం: ప్రధాని మోడీకి సియోల్ శాంతి పురస్కారం…

narendra-modi
- Advertisement -

narendra-modi

న్యూఢిల్లీ/సియోల్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చడం, ఆర్ధిక అభివృద్ధి కోసం చేస్తున్న కృషికిగానూ దక్షిణ కొరియా మోడీని సియోల్ శాంతి పురస్కారంతో సత్కరించింది.

గత అక్టోబర్‌లోనే సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి శుక్రవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ అవార్డు వ్యక్తిగతంగా తన ఒక్కడికి మాత్రమే కాదు… యావత్ భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

‘‘130 కోట్ల భారతీయులకు అంకితం..’’

‘‘గత ఐదేళ్లలో భారత్ సాధించిన విజయానికి గుర్తు ఇది. 130 కోట్ల భారత ప్రజల నైపుణ్యానికి ప్రతీక ఇది..’’ అని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరాన తనకు ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్‌’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రపంచ శాంతి, భద్రతలకు ఉగ్రవాదం పెను ప్రమాదంగా పరిణమించిందని మోడీ అన్నారు. ఇక సియోల్ శాంతి పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు మోడీనే కావడం విశేషం.

- Advertisement -