ఇంట్లో కొడుకు.. ఆఫీస్‌లో బాస్‌: కానిస్టేబుల్‌ కొడుకు ఎస్పీ అయ్యాడు…

ips son as boss
- Advertisement -

ips son as boss

లక్నో: తల్లిదండ్రులు తాము సాధించలేని వాటినో.. లేక తమ కంటే ఇంకా మంచి విజయాలని తమ పిల్లలు సాధించాలిన కోరుకుంటారు. అ విజయన్ని కోడుకు సాధిస్తే…  ఇక చెప్పడానికి మాటలు చాలవు. ప్రస్తుతం ఇలాంటి పుత్రోత్సాహాన్నే అనుభవిస్తున్నారు విభూతి ఖండ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న జనార్థన్‌ సింగ్‌.

- Advertisement -

ఎందుకంటే ఆయన కుమారుడు అనూప్‌ కుమార్ సింగ్‌ ఇప్పుడు ఆయనకే బాస్‌‌గా వచ్చారు. విషయమేంటంటే.. జనార్ధన్‌ సింగ్‌ కుమారుడు అనూప్‌ ఇప్పుడు లక్నో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమితులయ్యారు.

ఈ విషయం గురించి జనార్ధన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘వ్యక్తిగతంగా తండ్రి, కొడుకులం. కానీ వృత్తిపరంగా నా కొడుకు నా కంటే సుపీరియర్‌. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నా బాధ్యతలను నిర్వర్తిస్తాను’’ అని తెలిపారు.

అంతేకాదు, ‘‘ప్రోటోకాల్‌ ప్రకారం ఇప్పుడు నేను నా కుమారునికి సెల్యూట్‌ చేయాలి. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నా హృదయం గర్వంతో ఉప్పొంగి పోతుంది. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను..’’ అని గర్వంగా చెబుతున్నారాయన.

- Advertisement -