గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్: ప్రధాని అభినందనలు

12:37 pm, Tue, 19 March 19
Goa Chief Minister News, Pramod Sawant sworn, Gao Latest chief Minister News, Newsxpressonline

పనాజీ: మూడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించడంతో ఆ రాష్ట్ర కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్‌ మంగళవారం తెల్లవారుజామున(ఉదయం 2గంటలకు) ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
వీరితోపాటు మరికొద్ది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయీ సర్దేశాయి, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ధవళికర్‌లు డిప్యూటీ సీఎంలు కొనసాగనున్నారు. గోవాలోని ఈ రెండు చిన్న పార్టీలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి.

కాగా, ఇంతకుముందు ప్రమోద్ సావంత్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. సీఎం రేసులో ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, ఎంజీపీ చీఫ్ సుదీన్ ధవళికర్ పేర్లు కూడా వినిపించినప్పటికీ.. చివరకు ప్రమోద్ వైపే బీజేపీ మొగ్గుచూపాయి.

ప్రయాణం మొదలైందంటూ ప్రధాని..

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు. మీ ప్రయాణం మొదలైందని ప్రధాని పేర్కొన్నారు. కాగా, నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ గత ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన రక్షణశాఖ మంత్రిగా కూడా ఆయన అమూల్యమైన సేవలను అందించారు.