మోడీ మబ్బు మాటలపై ప్రియాంకా సెటైర్లు…

8:32 am, Tue, 14 May 19

ఢిల్లీ: భారత్ సైన్యం బాలాకోట్‌ సర్జికల్ దాడుల విషయంలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లతో సహ రాజకీయ నేతలు తెగ ట్రోల్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా మోడీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ పెద్ద ఢిఫెన్స్ ఎక్స్ పర్ట్ అని,యుద్ధ విమానాలు ఎవరు తయారుచేయాలో ఆయనే స్వయంగా డిసైడ్ అయ్యారని ప్రియాంక అన్నారు.

చదవండిఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్‌కి రివర్స్ షాక్ ఇచ్చిన స్టాలిన్…

రాఫెల్ డీల్ గురించి ఆమె పరోక్షంగా మాట్లాడుతూ…తమ జీవితంలో ఒక్క విమానం కూడా తయారుచేయనివాళ్లు యుద్ధ విమానాలు తయారుచేస్తారని మోడీ భావించాడన్నారు.

అసలు మోడీ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే

బాలాకోట్ సర్జికల్ దాడుల విషయంలో మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని మోడీ చెప్పారు. ఇక ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌పై దాడి చేసిందని చెప్పుకొచ్చారు.

అయితే వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘాలు దట్టంగా అలుముకున్న సమయంలో కూడా వాతావరణంలో రాడార్లు పనిచేస్తాయి. అయితే మోడీ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

చదవండి: మనదేశంలో గాడ్సేనే తొలి హిందూ టెర్రరిస్ట్: కమల్ సంచలన వ్యాఖ్యలు