చైనాకు మరో షాక్.. పబ్జీ సహా 118 యాప్‌లపై కేంద్రం నిషేధం

- Advertisement -

న్యూఢిల్లీ: గల్వాన్ ఘటన తర్వాత చైనాకు చెందిన 100కుపైగా యాప్‌లను నిషేధించిన కేంద్రం తాజాగా మరోమారు చైనాకు గట్టి షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన 118 యాప్‌‌లను నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభత్వం నిషేధించిన యాప్‌లలో పాప్యులర్ గేమ్ పబ్జీ సహా లివిక్, పబ్జీ మొబైల్ లైట్, విచాట్ వర్క్, విచాట్ రీడింగ్ వంటివి ఉన్నాయి. పబ్జీకి దేశంలో దాదాపు 3.3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద భారత సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతకు ముప్పుగా మారిన 118 మొబైల్ గేమ్స్‌ను నిషేధించినట్లు కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చైనా మొబైల్స్ యాప్స్ ద్వారా దేశ, పౌరుల సమాచారం చైనాకు చేరుతున్నట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ సైబర్‌స్పేస్ భద్రత, సార్వభౌమత్వానికి సవాల్‌గా మారిన 118 మొబైల్స్ యాప్స్‌పై నిషేధం విధించింది.

ఇప్పటికే రెండు దఫాలుగా టిక్‌టాక్ సహా చైనాకు చెందిన పలు మొబైల్స్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద చైనా ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు అమరులైన అనంతరం తొలుత 59, మరోసారి 49 చైనా మొబైల్స్ యాప్స్‌ను భారత్ నిషేధించింది.

తాజాగా నిషేధించిన 118 చైనా యాప్స్‌‌తో కలిసి భారత్‌ నిషేధించిన యాప్‌ల సంఖ్య 226కు చేరింది.

- Advertisement -