భారత్ వస్తూ.. 7 వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకున్న రాఫెల్ యుద్ధవిమానాలు

6:42 pm, Tue, 28 July 20

న్యూఢిల్లీ: భారత్ వాయుసేన శక్తిని రెట్టింపు చేసే విమానాలుగా మన్ననలు అందుకుంటున్న రాఫెల్ విమానాలు నిన్న ఫ్రాన్స్ ఉంచి భారత్ బయలుదేరాయి.

ఈ ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారత్ చేరుకోవాల్సి ఉంది. అందుకే వీటి వెంట ఓ ఇంధన ట్యాంకర్ విమానం కూడా వచ్చింది.

ఈ క్రమంలో గాల్లోనే రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఫ్రాన్స్ లోని భారత దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.

కాక్ పిట్ సమీపంలో ఉన్న ఓ పైప్ ద్వారా రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దాదాపు 30 వేల అడుగుల ఎత్తులో ఇంధనం నింపుకునే ప్రక్రియను విజయవంతంగా ముగించాయి.