ఏనుగులకూ కరోనా టెస్ట్.. తొలిసారిగా రాజస్థాన్‌లో.. ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -

రాష్ట్రంలోని ఏనుగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

- Advertisement -

ఈ మేరకు జైపూర్‌లోని 100 ఏనుగులకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని, దీనికోసం వాటి కళ్లనుంచి, నోటి నుంచి నమూనాలను సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది.

సేకరించిన నమూనాలను బరేలీలోని పశు వైద్య పరిశోధనా సంస్థ(ఐవీఆర్ఐ)కు పంపించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

- Advertisement -