కరోనా భయంతో.. సరిహద్దులు మూసేసిన రాజస్థాన్!

6:15 pm, Wed, 10 June 20
Rajasthan seals off borders

జైపూర్: కరోనా భయంతో రాష్ట్ర సరిహద్దులు మూసేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాజస్థాన్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం జరిగింది.

దీంతో సరిహద్దులు మూసేయాలని సర్కారు బుధవారం నిర్ణయించింది. పక్క రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించాలన్నా పర్మిట్ తప్పనిసరి అని అధికారులు ప్రకటించారు.

అధికారిక లెక్కల ప్రకారం రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 2,600 కరోనా కేసులు నమోదయ్యాయి.