పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే రేప్ చేయండి! ఢిల్లీ ఆంటీ సంచలన వ్యాఖ్యలు!

1:05 pm, Wed, 1 May 19
Delhi Latest News, Latest Rape News, Delhi Rape News, Newsxpressonline

ఢిల్లీ: సగం సగం దుస్తులు ధరించే అమ్మాయిలపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఢిల్లీకి చెందిన ఓ మహిళ. ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ, అక్కడున్న అమ్మాయిలను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అమ్మాయిలంతా తమను చూడాలనే పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని రోడ్లపైకి వస్తున్నారని విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా వీరంతా అత్యాచారం చేయించుకునేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

సాధ్యమైనంత ఎక్కువగా నగ్నంగా కనిపించడమే వీరి ఉద్దేశమని ఆంటీ చెప్పడంతో, అక్కడున్న అమ్మాయిలంతా ఆమెను రౌండప్ చేశారు. ఆంటీ మాటలపై సీరియస్ అయిన యువతులంతా చుట్టుముట్టి ఆమెను నిలదీశారు. సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ తంతంగం మొత్తాన్ని అక్కడున్న ఓ యువతి వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

పూర్తి వివరాలని చూస్తే.. తన స్నేహితులు ఓ రెస్టారెంట్ లో ఉండగా, ఓ మహిళ తమ వద్దకు వచ్చి వాదనకు దిగిందని ఆరోపించింది. షార్ట్స్ వేసుకున్నందుకు సిగ్గుపడాలని ఆమె అనడంతో, తాము వాదనకు దిగామని సదరు యువతి తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది.

ఇలాంటి దుస్తులు వేసుకున్న వారిని అవకాశం లభించినప్పుడల్లా రేప్ చేయాలని రెస్టారెంట్ లోని పురుషులకు ఆమె చెప్పిందని, దానికి వారంతా చప్పట్లు కొట్టారని యువతి తెలియజేసింది. దీంతో ఆమె వికృత మనస్తత్వాన్ని తాము ప్రశ్నిస్తూ వీడియో తీశామని వెల్లడించింది.

ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనని తాము డిమాండ్ చేసినా పట్టించుకోలేదని తెలిపింది. దాదాపు పది నిమిషాల నిడివివున్న ఈ వీడియోను తీసిన అమ్మాయి ఎవరన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.