న్యూఢిల్లీ: నోట్ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ నేడు భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరుకు ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రొ, రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్‌లను విడుదల చేసిన షియోమీ తాజాగా రెడ్‌మి నోట్ 9ను లాంచ్ చేసింది.
ఈ సిరీస్‌లో ఇది అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్. వెనకవైపు నాలుగు కెమెరాలతో వచ్చిన ఈ ఫోన్ కనీస ధర రూ. 11,999 మాత్రమే. శాంసంగ్ గెలాక్సీ ఎ21ఎస్, వివో, ఒప్పో ఎ9లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
రెడ్‌మి నోట్ 9 4జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 11,999 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ. 13,499 మాత్రమే. ఇందులో టాప్ వేరియంట్ అయిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.14,999.
ఈ నెల 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానుంది.
రెడ్‌మి నోట్ 9 స్పెసిఫికేషన్లు: 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో జి85 ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.