తగ్గిన మోడీ హావ! దూసుకుపోతున్న యుపిఎ! తాజా సర్వే!

10:19 am, Mon, 8 April 19
Narendra_Modi

ఢిల్లీ: ఒక కొత్త సర్వే ప్రకారం 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయేకు మెజారిటీ వస్తున్నా, అది బాగా బక్క చిక్కిపోతున్నది.ఇక యుపిఎ పక్షంలో బాగా వృద్ధి కనబడుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ స్థానాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది.ఈ రెండు కూటములకు చెందని వర్గానికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి.

అయితే, తెలంగాణలో కాంగ్రెస్ కు నాలుగు ఎంపిస్థానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలలో తనకు 16 వస్తాయని టిఆర్ ఎస్ ప్రచారం చేసుకుంటున్నపుడు కాంగ్రెస్ కు నాలుగు స్థానాలు లభిస్థాయని వార్త వెలవడటం ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఇదే విధంగా ఆంధప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు వస్తున్నాయి. ఇంతవరకు వచ్చిన సర్వేలలో తెలుగుదేశం పార్టీకి మూడు నాలుగు మించి ఇవ్వలేదు. వైసిపి కూడా తనకు మొత్తం 25 స్థానాలు వస్తాయన్న ధీమాతో ఉంది.

దేశవ్యాపితంగా అన్ని లోక్ సభ నియోజకవర్గాలలలో ఈ తాజా సర్వేని ఇండియా టివి-సిఎన్ ఎక్స్ లు నిర్వహించాయి. సర్వేని మార్చి 24 -31 మధ్య నిర్వహించారు. సర్వేని 543 నియోజకవర్గాలలో 65160 మంది శాంపిల్ తో చేశారు. ఈ సర్వే ప్రకారం, ఎన్డీ యే కు 275 సీట్లు మాత్రమే వస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన సింపుల్ మెజారిటీ కంటే చాలా స్వల్పంగా ఎక్కువ.

ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలనంటే 272స్థానాలు కావాలి. అంటే సర్వే ప్రకారం ఎన్డీయేకి సింపుల్ మెజారికంటే కేవలం మూడు స్థానాలే ఎక్కువ. ఇందులో బిజెపి వాట 230సీట్లు మాత్రమే. అంటే 250కంటే బిజెపి బలం పడిపోతున్నది. ఇది చాలా ప్రమాదకరమయిన పరిస్థితి. సర్వేప్రకారం కాంగ్రెస్ కు 97 సీట్లు వస్తున్నాయి. రద్దు కాబోతున్న లోక్ సభలో కాంగ్రెస్ కు ఉండేది కేవలం 44 మాత్రమే. మొత్తంగా యుపిఎకు 147స్థానాలు వస్తున్నాయి.

ఇక ఈ రెండు కూటాలకు సంబంధం లేని పార్టీలు అంటే సమాజ్ వాది పార్టీ, బిఎస్ పి, తృణ్ మూల్ కాంగ్రెస్, టిఆర్ ఎస్, వైసిపి వగైరాలకు వచ్చేంది 11 సీట్లు మాత్రమే.ఇదే ఇండియా టివి- సిఎన్ ఎక్స్ మార్చి మొదటి వారంలో కూడా సర్వే చేసింది. అప్పటికంటే ఇపుడు యూపిఎ పనితీరు మెరుగుపడింది.

మార్చి మొదటి వారంలో జరిపిన సర్వేలో ఎన్డీయేకి 285 స్థానాలు లభించాయి. సింపుల్ మెజారిటీ కంటే కేవలం 13 స్థానాలు ఎక్కువ. కాంగ్రెస్ యుపిఎ 126 మాత్రమే చూపించింది. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు 336 స్థానాలు వచ్చాయి.ఈ సర్వే ప్రకారం కూడా ఒదీషాల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వస్తున్నది. ఆంధ్రలో జగన్ పార్టీ వైసిసి చంద్రబాబు నాయుడి టిడిపి ని ఓడిస్తున్నది.

తాజా సర్వే ప్రకారం, బిజెపికి 230 లభిస్తే, ఎన్ డిఎ లోని మిగతాపార్టీల పరిస్థితి ఇలా ఉంది. శివసనే 13, ఎఐడిఎంకె 10, జెడియు 9, అకాలీదల్ 2, ఎల్ జెపి 3, పిఎంకె 2. యుపిఏ లో డిఎంకె 16, ఆర్ జెడి 8, టిడిపి 7 సీట్లను గెల్చుకుంటన్నాయని ఈ సర్వేచెబుతున్నది. ఇంకా పార్టీలకు సంబంధించి తృణమూల్ కు 28 సీట్లు వస్తున్నాయి. సమాజ్ వాది పార్టీకి 15, బిఎస్ పి 14, వైసిపికి 18, టిఆర్ ఎస్ కు 12, బిజెడి కి 14, వామపక్షాలకు 8 సీట్లు రావచ్చు.