నిర్భయ దోషులను ఉరితీసే తాడు రెడీ!

11:39 am, Wed, 8 January 20

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిని ఖరారు చేస్తూ పాటియాలా హౌస్ కోర్టు నిన్న డెత్ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నిందితులను ఉరితీయనున్నారు. తీర్పు తర్వాత తీహార్ జైలు అధికారులు ఉరికి సిద్ధమవుతున్నారు.

దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచిన అధికారులు వారి కదలికలను గమనిస్తున్నారు. మరోవైపు, ఉరికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దోషులను ఉరి తీసేందుకు మీరట్‌కు చెందిన తలారీ సేవలను ఉపయోగించుకోనున్నట్టు జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

బీహార్‌లోని బక్సర్ జైలు నుంచి ఇప్పటికే ఉరిశిక్ష అమలుకు అవసరమైన తాళ్లను తీహార్ జైలుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. గతంలో పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురును కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తాడుతోనే ఉరి తీశారు.