బీహార్ ఎన్నికల కోసమే గల్వాన్ నాటకం.. ప్రధాని మోదీపై శివసేన సంచలన ఆరోపణలు

- Advertisement -

ముంబై: గల్వాన్ ఘటనపై శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే బీజేపీ గల్వాన్ నాటకం ఆడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

భారత సైనికుల త్యాగాన్ని ఉపయోగించుకుని బీహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కుల, ప్రాంతీయ కార్డు’ రాజకీయాలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

బీహార్ ప్రజలతో తాను మాట్లాడుతున్నానంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను శివసేన అధికారిక పత్రిక సామ్నా దుయ్యబట్టింది. చైనా సైన్యంతో పోరాడుతున్న బీహారీల శౌర్యాన్ని చూసి గర్విస్తున్నానని, బీహార్ రెజిమెంట్ అమరులకు నివాళులు అర్పిస్తున్నానని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సామ్నా విమర్శలు కురిపించింది.

“ప్రధాని మోదీ అటువంటి రాజకీయాల్లో నిపుణుడు. గల్వాన్‌ వ్యాలీలోని ‘బీహార్ రెజిమెంట్’ యొక్క శౌర్యాన్ని ఆయన ప్రశంసించారు. అంతకుముందు, దేశం సరిహద్దుల్లో ముప్పును ఎదుర్కొన్నప్పుడు మహర్, మరాఠా, రాజ్‌పుత్, సిక్కు, గూర్ఖా, డోగ్రా రెజిమెంట్లు పనిలేకుండా కూర్చున్నాయా? రాబోయే బీహార్ ఎన్నికల కారణంగా భారత సైన్యంలో కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ఒక వ్యాధి వంటివి. ఇది కరోనా వైరస్ కంటే తీవ్రమైనది” అని ఘాటుగా స్పందించింది.

- Advertisement -